అమ్మాయిని అల్లరి చేసినందుకు జబర్దస్త్ హైపర్ ఆదిని చితకబాదిన జనం..! (వీడియో)

by Hamsa |   ( Updated:2024-02-15 09:03:50.0  )
అమ్మాయిని అల్లరి చేసినందుకు జబర్దస్త్ హైపర్ ఆదిని చితకబాదిన జనం..! (వీడియో)
X

దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి పరిచయం అవసరం లేదు. తన కామోడీ టైమింగ్‌తో పంచులు వేస్తూ జనాల పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంటాడు. గ్యాప్ లేకుండా వరుస పంచ్‌లు వదులుతూ ఫన్నీగా ఉంటాడు. ఈ షో ద్వారా హైపర్ ఆది ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో వంటివి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నాగచైతన్య ‘రారండోయ్ వేడుక చెద్దాం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆది వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల విశ్వక్ సేన్, నేహా శెట్టి కాంబోలో రాబోతున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి లో ఆది కీలక పాత్రల్లో నటించాడు. ఈ చిత్రం మార్చి 8న థియటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది కొన్ని రూమర్స్‌పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ సుజాత హోస్ట్‌గా చేస్తున్న జోర్దార్ పార్టీ విత్ సుజాత అనే టాక్ షో లో ఆది పాల్గొన్నాడు. ఇందులో భాగంగా సుజాత పలు ప్రశ్నలు అడిగింది.

ప్రస్తుతం జబర్దస్త్‌‌కు ఎక్కువగా రావడం లేదు అని అడగ్గా.. దానికి ఆది ఆ షోలో స్కిట్ చేయాలంటే వారం రోజుల పాటు అదే పనిలో ఉండాలి. కచ్చితంగా అలా చేయలేం. ప్రస్తుతం నాలుగైదు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం కంప్లీట్‌గా టైమ్‌ను కేటాయించలేకపోతున్నాము. జబర్దస్త్ చేయాలంటే కచ్చితంగా మిగతావన్ని మన మైండ్‌లో ఉండకూడదు అంత వర్క్ చేయాలి. ఎందుకంటే మనమే స్క్రిప్ట్ రాసుకోవాలి. నేను ప్రాక్టీస్ చేయించాలి.

మళ్లీ నేనే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అన్నీ చూసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం ఆ షోకు దూరంగా ఉన్నాను అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఓ అమ్మాయిని అల్లరి చేసినందుకు నిన్ను ఒంగోలులో కొట్టారట అని అడగ్గా.. ‘‘అదంతా అబద్ధం. నేను అసలు అమ్మాయిలతోనే మాట్లాడను. షోలో కూడా స్కిట్స్‌లో భాగంగానే అమ్మాయిలతో మాట్లాడతాను. జోక్స్ వేస్తాను అంతే. అది అయిపోయాక వాళ్లతో అస్సలు మాట్లాడను. నేను అమ్మాయిని గెలకడం, జనాలు నన్ను కొట్టడం అనేది అంతా ఫేక్ అని సమాధానమిచ్చాడు. అలాగే తన కెరీర్ గురించి చెబుతూ పలు కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆది చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.


Next Story

Most Viewed