- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పబ్‌లో ప్రియుడి తలపై బీర్ బాటిల్ బద్దలు కొట్టిన పాయల్.. షాకింగ్ వీడియో వైరల్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ అందరికీ సుపరిచితమే. హీరో కార్తీక్ RX 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మరీ బోల్డ్‌గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ తన ఖాతాలో వేసుకోలేక పోయింది. పాయల్ ఇటీవల మంగళవారం మూవీతో ప్రేక్షకులను అలరించింది.
ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలను పంచుకుంటుంది. తాజాగా, పాయల్ తన వాలెంటైన్స్ డే ఎలా ఎక్కడ జరుపుకుందో తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ప్రియుడు సౌరబ్‌తో కలిసి పబ్‌లో కనిపించింది. ఓ సినిమా షూట్‌లో భాగంగా ప్రియుడి తలపై బీర్ బాటిల్‌తో పాయల్ కొట్టింది.
ఈ వీడియోను షేర్ చేస్తూ.. నా వాలెంటైన్స్ డేను ఇలా జరుపుకుంటున్నాను. మీరేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి అంటూ క్యాప్షన్ జత చేసింది. దీనికి ఓ నెటిజన్ మళ్లీ ట్రై చేయండి అని కామెంట్ పెట్టగా.. దానికి సౌరబ్ ఇది ఒక బ్యాడ్ ఐడియా అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం పాయల్ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకొద్దు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.