- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పవన్ కళ్యాణ్ అలా చేయడం నాకు చాలా బాధను కలిగించింది.. పవర్ స్టార్ తల్లి ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించిన పవన్.. ఏపీ పాలిటిక్స్‌లోనూ ఒక కొత్త చరిత్ర రాశాడు. చెప్పాలంటే.. గత 50,60 ఏళ్లలో ఎప్పుడు కూడా చూడని పాలిటిక్స్‌ని చూపించాడు. అసలు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సైతం ఈ సారి ఏపీ ఎన్నికల గురించి ఎదురు చూశారంటే.. పవన్ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా తన సత్తా చూపించి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి 21 స్థానాలకు 21 సీట్లు గెలిచి వావ్ అనిపించాడు. అలా గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మని స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని జనసేన పార్టీ ఛానల్‌లో రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో యాంకర్ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్న సంఘటనను గుర్తు చేసింది. ఇక దాని గురించి అంజనమ్మ మాట్లాడుతూ.. అలా రోడ్డు మీద ఆపితే అక్కడే పడుకున్నప్పుడు చాలా బాధ కలిగింది. పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా. ఇది చేయాలి అంటే చేసేసేవాడు అని పవన్ గురించి అంజనమ్మ చెప్పుకొచ్చింది. కాగా పవన్.. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో హైదరాబాద్ నుంచి వెళ్తుంటే జగ్గయ్యపేట వద్ద పోలీసులు అడ్డుకోగా అప్పుడు పవన్ రోడ్డు మీదే పడుకొని ప్రొటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనని ఉద్దేశించి అంజనమ్మ ఇలా మాట్లాడారు. ప్రస్తుతం అంజనమ్మ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్‌గా మారింది. ఇంటర్వ్యూలో అంజనమ్మ పవన్ కళ్యాణ్ గురించి ఇంకేమి విషయాలు చెప్పారో అని మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఈ ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఇంటర్వ్యూ త్వరలో జనసేన ఛానల్ లో అమ్మ మనసు అనే పేరుతో రిలీజ్ కానుంది. మీరు కూడా ఒకసారి ఈ ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి.
"అమ్మ మనసు"Full interview soon on JanaSena Party official YouTube channel : - https://t.co/spri3sgwti pic.twitter.com/2YToTLZz4i
— JanaSena Party (@JanaSenaParty) October 1, 2024
(video link credits to janasena party X account)