Pawan Kalyan: గ్రాండ్‌గా వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌.. పవన్ లుక్ చూశారా?

by Vinod kumar |
Pawan Kalyan: గ్రాండ్‌గా వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌.. పవన్ లుక్ చూశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వరుణ్ పెళ్లి పనులు ఇటలీలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు.. అందరు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నారు కానీ, ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ఒక్క ఫొటోలో కనిపించలేదు. దీంతో ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ ఫోటో.. పవన్ ఎక్కడ..? అంటూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేయడం మొదలుపెట్టారు. అంతేనా.. దీనిమీద మీమ్స్ వేస్తూ.. పవన్ ఫోటో కావాలి అంటూ రచ్చ స్టార్ట్ చేశారు. ట్విట్టర్ ట్రెండింగ్‌లో varunluv హ్యాష్ ట్యాగ్ ఉన్నా కూడా అందులో పవన్ ఎక్కడ అనే మీమ్స్ మాత్రమే ఎక్కువ ఉండడం విశేషం.

పవన్ కళ్యాణ్.. వరుణ్ పెళ్ళిలో కనిపించాడు. ముఖం కనిపించకపోయినా.. ఆయన బ్యాక్‌ను అభిమానులు గుర్తుపట్టేశారు. వరుణ్‌ను పెళ్లి కొడుకుగా తయారుచేసి తీసుకెళ్తున్న తరుణంలో క్లిక్ చేసిన ఫొటోలో నాగబాబు.. ఆయన పక్కన పవన్ దర్శనమిచ్చారు. అందరు పెళ్లిలో హడావిడిగా.. డిజైనర్ దుస్తుల్లో కనిపించగా.. కేవలం పవన్ మాత్రమే చాలా సింపుల్‌గా కనిపించాడు. ఆలివ్ కలర్ టీ షర్ట్.. ఖాకీ కలర్ ప్యాంట్‌లో పవన్ కనిపించాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్ ఆడిస్తున్నాయి.



Next Story