పాన్ ఇండియా మూవీతో కిరణ్ అబ్బవరం.. ఇంట్రెస్టింగ్ టైటిల్ రివీల్

by Javid Pasha |
పాన్ ఇండియా మూవీతో కిరణ్ అబ్బవరం.. ఇంట్రెస్టింగ్ టైటిల్ రివీల్
X

దిశ, సినిమా : ఎస్ఆర్ కల్యాణ మండపం, రాజావారు రాణిగారు, సమ్మతమే.. వంటి సినిమాలతో ప్రేక్షకులను తనదైన స్టైల్‌లో అలరించిన నటుడు కిరణ్ అబ్బవరం. అయితే త్వరలో మరో పాన్ ఇండియా లెవల్ మూవీతో కూడా రాబోతున్నట్లు రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశాడు. ఇకపోతే శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గోపాల కృష్ణ నిర్మాతగా, సందీప్, సుజీత్ సంయుక్త దర్శకత్వంలో రూ. 20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. తాజాగా దానికి సంబంధించిన టైటిల్‌ను ‘క’గా ఖరారు చేస్తూ ప్రకటించారు.

మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం కూడా KA ప్రొడక్షన్ బ్యానర్‌తో నిర్మాతగా మారిండు. పీరియాడిక్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘క’ షూటింగ్ దాదాపు పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దీనిని రిలీజ్ చేయనున్నారట. కాగా సినిమాకు ‘క’ అనే సింగిల్ లెటర్‌తో టైటిల్ డిసైడ్ చేయడంతో అందులో ఏముంటుందో అనే ఆసక్తి నెలకొంది. కిరణ్ అబ్బవరం ఎలాంటి క్రియేటివిటీ ప్రదర్శిస్తాడో చూడాలని సినీ అవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.Next Story

Most Viewed