దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినా ఎవరూ నమ్మరు: భార్య సినిమాలపై మోసిన్

by Disha Web |
దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినా ఎవరూ నమ్మరు: భార్య సినిమాలపై మోసిన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి రినారాయ్‌ని పెళ్లి చేసుకోవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మోసిన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న మోసిన్ గతాన్ని గుర్తుచేసుకుంటూ.. 1983లో తామిద్దరం ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కొన్నేళ్లకు మనస్పర్థలతో విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు. అయితే తమకు కూతురు సనమ్ ఉందన్న ఆయన.. ‘రినాను మ్యారేజ్ చేసుకోవడంలో నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేనొక మనిషినే పెళ్లాడాను. ప్రాంతం, కులం గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. ఇప్పటికీ ఆలోచించను. మా వివాహానికి ముందు ఆమె సినిమాలు నేను చూడలేదు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినా ఈ విషయం ఎవరూ నమ్మరు. ఒక అమితాబ్ బచ్చన్ సీన్లు మాత్రమే చూస్తా. అందాన్ని చూసి ఆకర్షణకు లోనవను. మంచి మనుషులు, మానవత్వం ఉన్నవాళ్లంటే నాకు చాలా ఇష్టం. గౌరవం కూడా’ అని వివరించాడు. అయితే మోసిన్ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు అంతకుముందు పలు సినిమాల్లోనూ నటించాడు.Next Story