పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది.. అప్పుడు ఈ రూమర్స్ వచ్చేవి కాదు.. నటి షాకింగ్ కామెంట్స్

by sudharani |
పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది.. అప్పుడు ఈ రూమర్స్ వచ్చేవి కాదు.. నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలపై రూమర్స్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటాయి. నటీనటులు కలిసి ఒకదగ్గర కనిపిస్తే చాలు వారి మధ్య ఏదో ఉన్నట్లు రూమర్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తుంటారు. అయితే.. ఇలాంటి గాసిప్స్‌ను కొంత మంది సెలబ్రెటీలు లైట్ తీసుకుంటారు. కానీ మరికొందరూ మాత్రం స్పందిస్తూ.. తమదైన స్టైల్‌లో రిప్లైలు ఇస్తారు. ఈ క్రమంలోనే తాజాగా తనపై వచ్చిన రూమర్స్‌పై స్పందించింది పాకిస్తాన్ నటి హనియా.

అయితే.. సింగర్ బాద్‌షాతో నటి హనియా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్‌లపై మరొకరు రియాక్ట్ కావడం.. దుబాయ్‌లో కలుసుకోవడంతో ఈ రూమార్స్‌కు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. తాజాగా వీటిపై స్పందించిన హనియా మాట్లాడుతూ.. ‘బాద్‌షా పాటలంటే నాకు ఇష్టం. అతడు నాకు మంచి ఫ్రెండ్. తనతో కలిసి పార్టీ చేసుకున్న దానికి రిలేషన్ అంటగడుతున్నారు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అతిగా ఊహించుకుంటున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నేను పెళ్లి చేసుకోకపోవడమే పెద్ద సమస్య అనుకుంటా.. ఒకవేళ నేను పెళ్లి బంధంలో ఉండి ఉంటే ఇలాంటి రూమర్లు వచ్చేవి కావు’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story