విడాకుల అయినా ఆ విషయంలో కలిసే ఉన్నామంటూ.. అమీర్ ఖాన్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-02-25 04:27:09.0  )
విడాకుల అయినా ఆ విషయంలో కలిసే ఉన్నామంటూ.. అమీర్ ఖాన్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాపాటా లేడీస్‌’.అమీర్ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించాగా , బిప్లబ్ గోస్వామి అవార్డు-విజేత కథ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందించబడింది. కాగా ఈ మూవీ మార్చి 1న విడుదల కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అనేక అంశాలపై చర్చించగా.. వాటిలో అమీర్ ఖాన్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.. ‘అమీర్ ఖాన్‌కు పాడటం అంటే చాలా ఇష్టం.అతను పాడటం కూడా నేర్చుకుంటున్నాడు. అమీర్‌కు ముందు నుండి సినిమాల్లో పాటలు పాడాలని ఉంది. సినిమాల్లో నటించాలనుకునే గాయకులు చాలా మంది ఉన్నారు. కానీ అమీర్ ఖాన్ మాత్రం అందుకు విరుద్ధం.. ఆయన గాయకుడు కావాలనుకునే నటుడు.

అమీర్ చాలా సెన్సిటివ్..చాలా ఓపిక గల వ్యక్తి.. అన్నీ చాలా కంఫర్ట్‌గా చేస్తాడు. ఒక విధంగా చెప్పాలి అంటే . ఎందుకంటే విడాకుల తర్వాత కూడా నేను అమీర్ ఖాన్‌తో తన ఫ్యామిలితో టచ్ లోనే ఉన్నాను. ఎందుకంటే మా కుమారుడిని కలిసి పెంచాలనుకున్నాం. అందుకే ఈ రోజుకు కూడా ఇద్దరం ఒకే భవనంలో ఒక కుటుంబంలా కలిసి జీవిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది కిరణ్. ప్రజంట్ ఈ మాటలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed