నాకందుకే బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అవ‌కాశాలు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్!

by Kavitha |
నాకందుకే బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అవ‌కాశాలు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తాప్సీ మన అందరికీ సుపరిచితమే. తర్వాత MR ఫర్‌ఫెక్ట్, దరువు, మొగుడు, సాహసం, షాడో వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అనంతరం బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా వరుస మూవీలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బ్యాండ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం పలు సిరీస్ చేస్తూ దూసుకుపోతుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ కార్య‌క్ర‌మంలో త‌న బాలీవుడ్ సినీ కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు పంచుకుంది. న‌టి ప్రీతి జింతాకు నేను అప్ గ్రేడ్ వ‌ర్ష‌న్ అని చాలాంది చాలా సంద‌ర్భాల్లో త‌నకు చెబుతుంటార‌ని అది నిజ‌మేన‌ని అన్నారు. ఆ విష‌యంగానే నేను బాలీవుడ్‌లో నిల‌దొక్కుకోగ‌లిగాన‌ని, వ‌రుస‌గా చాన్సులు ద‌క్కించుకోగ‌లుగుతున్నాని చెప్పుకొచ్చింది. దీనంత‌టికీ కార‌ణం పాజిటివిటీ అని అన్నారు. ప్రీతి జింతా మాదిరి నాకు ఈ పాజిటివ్ నెస్ చాలా ఎక్కువ అని భ‌విష్య‌త్‌లోనే ఇలానే ఉంటాన‌ని స్ఫ‌స్టం చేసింది.

కాగా ప్రస్తుతం తాప్సీ హసీనా దిల్ రూబా చిత్రానికి సీక్వేల్‌గా వస్తున్న ఫిర్ అయి మసీనా దిల్‌రూబా మూవీలో నటిస్తుండగా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.Next Story

Most Viewed