మరోసారి.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న శ్రీలీల

by Prasanna |
మరోసారి.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న శ్రీలీల
X

దిశ, సినిమా: రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ, శ్రీకాంత్ తనయుడు రోషన్ జంటగా నటించిన ఈ మూవీ హిట్ గా నిలిచింది. అన్నింటి కన్నా.. రవితేజ హీరోగా నటించిన ధమాకా చిత్రం శ్రీలీలాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి గల కారణం సినిమాలో శ్రీలీల గ్లామర్, డ్యాన్స్.

పెళ్లి సందడి హిట్ అవ్వడంతో ఈ అమ్మడు కి ఒకటి కాదు రెండు ఏకంగా 9 సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇలా ఒకేసారి ఇన్ని ఆఫర్లు అందుకున్న హీరోయిన్ గా శ్రీ లీల కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే, వీటిలో ఒకటి, రెండు తప్ప మిగతావి అన్ని మంచి విజయం అందించలేకపోయింది.

ఇదిలా ఉండగా.. సామజవరగమన రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ హీరోగా కథానాయికగా శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 2025లో సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి, సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో శ్రీలీల జాయిన్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.

Next Story

Most Viewed