ఇకపై మెగాఫ్యాన్స్ చిరంజీవి వంటింటి రుచి చూడొచ్చు..! సురేఖ కొణిదెల బర్త్ డే స్పెషల్ పోస్ట్

by Anjali |
ఇకపై మెగాఫ్యాన్స్ చిరంజీవి వంటింటి రుచి చూడొచ్చు..! సురేఖ కొణిదెల బర్త్ డే స్పెషల్ పోస్ట్
X

దిశ, సినిమా: నేడు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సురేఖకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగాస్టార్ జస్ట్ విషెష్ చెబితే ఏం బాగుంటుందేమో అనుకున్నాడెమో.. కాగా సురేఖకు యాస, ప్రాస, కవిత్వ అదిపోయేలా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ‘నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ! నా లైఫ్‌ లైన్‌, నా బలం వెనకున్న గొప్ప పిల్లర్‌ అయిన సురేఖకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి రాసుకొచ్చాడు.

తాజాగా కోడలు ఉపాసన.. అత్త సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘తమ్మ పుట్టినరోజు సందర్భంగా మా వ్యవస్థాపక వెంచర్ - ‘అతమ్మ కిచెన్‌’ ను ప్రారంభించడం మాకు ఆనందంగా ఉంది. రుచి సంప్రదాయానికి అనుగుణంగా ఉన్న చోట & పాక బంధాలు తరతరాలుగా నిర్మించబడతాయి. మేము రెడీ చేసిన ఫుడ్‌ను అనుభవించండి - నేరుగా మా వంటగది నుంచి మీ ఇంటికి వస్తుంది’. అంటూ ఉపాసన రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story