- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవన్ కల్యాణ్ అలాంటి వారంటూ.. OG బ్యూటీ ఆసక్తికర పోస్ట్

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత శ్రీకారం వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాని సరిపోదా శనివారం, పవర్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రియాంక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా, ఈ యంగ్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది.
అందులో ఓ నెటిజన్ ‘పవర్ పవన్ కల్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి ప్లీజ్ స్కిప్ చేయకండి’ అని ప్రశ్నించాడు. దానికి ప్రియాంక సమాధానమిస్తూ.. ‘‘ ఆయన ఒక లెజెండ్. అద్భుతమైన మనిషి. గొప్ప లీడర్. రియల్ పవర్ స్టార్’’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ తర్వాత ఎన్ని బాషలు మాట్లాడగలరు అన్న ప్రశ్నకు ఈ భామ తమిళ, తెలుగు, కన్నడ, హీందీ, ఇంగ్లీష్ అంటూ బదులిచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ప్రియాంక పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.