నాగచైతన్య రెండో పెళ్లి ఫిక్స్.. కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన.. అమ్మాయి ఎవరంటే..?

by Javid Pasha |
నాగచైతన్య రెండో పెళ్లి ఫిక్స్..  కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన.. అమ్మాయి ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నాగార్జున దంపతులు కూడా చైతూకు రెండు పెళ్లి చేయాలని ఫిక్స్ అవ్వగా.. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలన్నీ నిజమయ్యేలా కనిపిస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతూ రెండో పెళ్లి దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ఇండియా టుడే కథనం దీనిని ధృవీకరించింది.

సమంతతో విడాకుల తర్వాత శోభితతో చైతూ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు వారిద్దరూ అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. అయితే త్వరలోనే పెళ్లిపై వీరిద్దరూ అధికారిక ప్రకటన చేయనున్నారని ఇండియా టుడే కథనం ప్రచురించింది. వారిద్దరికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా ఈ విషయం తెలిసినట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఇరువురు తమ రిలేషన్‌షిప్ గురించి అఫిషియల్‌గా ప్రకటన చేసే అవకావముందని, త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందని ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది.

ఎప్పటినుంచో శోభిత, చైతూ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఇద్దరూ కలిసి తిరుగుతున్న ఫొటోలు కూడా బయటకొచ్చాయి. వీరి లవ్ గురించి కూడా గతంలో సమంత పరోక్షంగా స్పందించింది. ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే నాకేంటి? అంటూ ఒక ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో తర్వాత తన వ్యాఖ్యలపై స్యామ్ ట్వీట్ చేసింది. తాను ఎవరి గురించి అలా అనలేదని వివరణ ఇచ్చింది. దీంతో చైతూ-శోభిత డేటింగ్ గురించి సమంత ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకోవడం లేదని, ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం జరగనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టాలని చైతూ భావించాడని, త్వరలోనే శోభితతో పెళ్లిపై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కాగా శోభిత తెలుగు అమ్మాయి కాగా.. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించింది. అలాగే పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది.

Next Story