బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు గెలుచుకున్న తారక్.. అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎమోషనల్ ..

by Disha Web Desk 6 |
బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు గెలుచుకున్న తారక్.. అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎమోషనల్ ..
X

దిశ, సినిమా: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్, భీమ్ పాత్రలో తారక్ అద్భుతంగా నటించారు. అయితే తాజాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కడం గమనార్హం. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నేను పడిపోయిన ప్రతిసారీ నన్ను పైకి లేపి పట్టుకున్నందుకు, నా కళ్లలో నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కకు బాధపడ్డందుకు, నాతో పాటు నవ్వినందుకు అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

Next Story