క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్.. ఏమన్నారంటే? (వీడియో)

by Hamsa |
క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్.. ఏమన్నారంటే? (వీడియో)
X

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్ క్యాన్సర్‌తో పోరాడుతూ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తాను ఎన్టీఆర్ అభిమానిని అని చనిపోయేలోపు ‘దేవర’ సినిమా చూడాలని వైద్యులను వేడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కౌశిక్ తల్లిదండ్రులు కూడా దాతలు సాయం చేయాలంటూ మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి వైద్యానికి రూ. 60 లక్షలు ఖర్చు అవుతుందని మీకు తోచినంత సహాయం చేయాలంటూ అందరినీ కోరారు.

ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ యువకుడితో వీడియో కాల్ మాట్లాడినట్లు సమాచారం. తాజాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే.. తారక్ ‘‘కౌశిక్ బాగున్నావా. నువ్వు ధైర్యంగా కోలుకుని బయటకు వచ్చి దేవర చూడాలి. సినిమా అనేది తర్వాత కానీ నువ్వు ముందు కోలుకుని ఆరోగ్యంగా ఉండాలి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి’’ అంటాడు.

దీంతో కౌశిక్ ‘‘అన్నా మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు. దేవర మూవీని కచ్చితంగా చూస్తాను అన్నా. నేను బాగానే ఉన్నాను. దేవర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నట్టున్నారు అందుకే రాలేదు లేదంటే మీరు వచ్చే వారు నాకు తెలుసు అన్నా’’ అంటాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Read More....

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేదప్పుడే.. నెట్టింట వైరలవుతోన్న ప్లేస్, డేట్, గెస్ట్

Next Story

Most Viewed