బాత్‌ రూమ్‌లో కూర్చొని తిన్న రోజులున్నాయి : Priyanka Chopra

by sudharani |
బాత్‌ రూమ్‌లో కూర్చొని తిన్న రోజులున్నాయి : Priyanka Chopra
X

దిశ, సినిమా: హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తన బాల్యంలో ఎదుర్కొన్న సంఘటనలను చెప్పుకొచ్చింది. ప్రియాంక మాట్లాడుతూ.. ‘హైస్కూల్ విద్య కోసం అమెరికా వెళ్లినప్పుడు, కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అక్కడ వారితో ఎలా స్నేహంగా ఉండాలో అర్థం కాలేదు.

క్యాంటీన్‌కు వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియదు. వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకొని, ఎవరూ చూడకుండా బాత్రూమ్‌లోకి వెళ్లి తినేసి క్లాస్ రూమ్‌కు వెళ్లేదాన్ని. అలా చాలా రోజులు గడిపాను. నాకున్న భయంతో అలా ఉండాల్సి వచ్చేది. ఒక నెల రోజులు అంతా పరిశీలించిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

Read more:

సౌత్ ఇండస్ట్రీపై ఐశ్వర్యా రాయ్ కామెంట్స్ వైరల్

Next Story