- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంత డబ్బు ఇచ్చినా సరే వెడ్డింగ్‌లో అలాంటివి చేయను.. అంబానీ వేడుక గురించి కంగనా సంచలన పోస్ట్

దిశ, సినిమా: ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మూడు రోజులు పాటు నిర్వహించిన ఈ వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్ గా నిలిచింది. దీనికి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయి సందడి చేశారు. అంతేకాకుండా ఈ వేడకలో డ్యాన్స్ ఫెర్మామెన్స్ వంటివి చేసి కొట్లల్లో డబ్బు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఇందులో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్స్ పాల్గొనడం నెట్టింట చర్చానీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే.. స్టార్ హీరోయిన్ కంగనా బాలీవుడ్ స్టార్స్‌ను ఉద్దేశించి ఓ సంచలన పోస్ట్ పెట్టింది. దివంగత సింగర్ లతా మంగేష్కర్ గతంలో చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తూ ‘‘ నేను లతా మంగేష్కర్ ఒకేలా ఆలోచిస్తామని అనుకుంటున్నాను. అయితే నేను చాలా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ కొన్ని నిర్ణయాలను ఎప్పుడూ మార్చుకోలేదు. పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకల్లో ఫెర్మామెన్స్ ఇవ్వడానికి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వాటిని ఒప్పుకోలేదు దూరంగా ఉన్నాను.
ఇక ముందు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను. డబ్బు కంటే గౌరవం ముఖ్యమైనదని నేను నమ్ముతాను. కాబట్టి డబ్బుల కట్టలు వస్తున్నా వద్దు అనుకున్నాను. యువత కూడా అర్థం చేసుకోవాలి. షార్ట్ కట్స్ అస్సలు మంచివి కాదు. ఆ దారిలో వెళితే ఇబ్బందులు తప్పవు’’ అంటూ రాసుకొచ్చింది. అయితే అంబానీ ఇంట బాలీవుడ్ స్టార్స్ డబ్బుల కోసమే అలాంటి పనులు చేశారని చెప్పకనే చెప్పింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.