ప్రభాస్‌కంటే తక్కువేం కాదట.. ప్రశాంత్ నీల్ మూవీతో యంగ్ టైగర్ భారీ స్కెచ్

by Javid Pasha |
ప్రభాస్‌కంటే తక్కువేం కాదట.. ప్రశాంత్ నీల్ మూవీతో యంగ్ టైగర్ భారీ స్కెచ్
X

దిశ, సినిమా : ప్రభాస్ ‘కల్కి’ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ ఫ్యాన్స్‌‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ అంతా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్‌వైడ్ ఫేమ్ సంపాదించుకున్న ప్రభాస్, ఆ తర్వాత ఎక్కడా తగ్గడం లేదు. పాన్ ఇండియా లెవల్లో తన టాలెంట్ నిరూపించుకుంటున్నాడు. రెమ్యునరేషన్ విషయంలోనూ టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. బాహుబలి, సాహో మూవీస్ తర్వాత డార్లింగ్ ప్రతీ సినిమాకు దాదాపు రూ.120 కోట్లకు అటు ఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటన్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రశాంత్ నీల్ మూవీతో ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రభాస్‌తో పోటీ పడేందుకు రెడీగా ఉన్నాడు. ఆ రేంజ్‌లోనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నీల్ డైరెక్షన్‌లో రాబోతున్న ఓ కొత్త సినిమాకు యంగ్ టైగర్ కూడా రూ. 130 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట. కాగా కొత్త మూవీకి సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ రీసెంట్‌గా అప్డేట్ అందించారు. ఆగష్టు నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వార్ 2, దేవర లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ అప్పటి వరకు వీటి షూటింగ్స్ కూడా పూర్తి చేసుకోనున్నాడట. వార్ 2 ద్వారా బాలీవుడ్ గడప తొక్కిన జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ లెవల్‌ను అందుకోవడం మరెంతో దూరంలో లేదని ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed