సడెన్‌గా పెళ్లి కూతురిగా దర్శనమిచ్చి షాకిచ్చిన నిత్యా మీనన్.. ఫొటోలు వైరల్

by Hamsa |
సడెన్‌గా పెళ్లి కూతురిగా దర్శనమిచ్చి షాకిచ్చిన నిత్యా మీనన్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిత్యామీనన్ ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, నితిన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాని, సూర్య వంటి స్టార్స్‌తో సలు చిత్రాల్లో నటించితన నటనతో పాపులారిటీ దక్కించుకుంది. ఈ అమ్మడు చివరిగా తిరు మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. అలాగే నిత్యామీనన్ పలు చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంది. తెలుగు, తమిళ, మలయాళం వంటి భాషల్లో నటిస్తూ.. తన క్రేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, నిత్యామీనన్ ఓ ఫొటో షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లి కూతురి గెటప్‌లో గదిలో బెడ్‌పై పడుకుని బాధపడుతున్న ఫొటోలు షేర్ చేసింది. అయితే అది తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘సమాప్తి’ మూవీకి సంబంధించిన పోస్టర్స్ అని రాసుకొచ్చింది. ‘‘సమాప్తి మూవీలోని మృణ్మోయి పాత్ర. సత్యజిత్ రే అదే పేరుతో ఠాగూర్ చిన్న కథ ఆధారంగా రాబోతుంది. ఇది ఒక ప్రేమకథ, ఇది దాని ప్రధాన పాత్ర అయిన మృణ్మోయి వికృత, నిర్లక్ష్య యువతి నుండి ప్రేమించే భార్యగా చేసే బాధాకరమైన ప్రయాణాన్ని చూపుతుంది. రీమాజిన్ అనేది పాత్రతో సరికొత్త రూపాన్ని, అనుభూతిని సృష్టించడానికి వాటి నుండి కొత్త కథను తిప్పడానికి చేసిన ప్రయత్నం’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం నిత్యామీనన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా అవి చూసిన వారంతా సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed