నిత్యా మీనన్ ‘డియర్ ఎక్సెస్’ సినిమాలో టాలీవుడ్ హీరో..

by Hamsa |
నిత్యా మీనన్ ‘డియర్ ఎక్సెస్’ సినిమాలో టాలీవుడ్ హీరో..
X

దిశ, సినిమా : నిత్యా మీనన్ హీరోయిన్ గా ఇప్పటికే 'డియర్ ఎక్సెస్ ' మూవీ ప్రకటించారు. కామిని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కథ.. ఒక అమ్మాయి తన లైఫ్ లో బ్రేకప్స్ ను ఎలా డీల్ చేస్తుందనే అంశం చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దుతున్న లేడీ డైరెక్టర్.. అన్ని ఇండస్ట్రీల నుంచి ఒక్కో హీరోను సెలెక్ట్ చేసుకుంది. మాలీవుడ్ ను దీపక్ పరంబోల్, కోలీవుడ్ వినయ్ రాయ్, టాలీవుడ్ నవదీప్, బాలీవుడ్ ను ప్రతీక్ బబ్బర్ రిప్రజెంట్ చేయబోతున్నారు. ఇక నిత్య సౌత్, నార్త్ లో ఫెమిలియర్ కాబట్టి ఆమె ఈ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ చాయిస్ గా ఎంచుకుంది. సాధారణంగా బ్రేకప్ జరిగినప్పుడు అబ్బాయిల ఎమోషన్స్ గురించి మాత్రమే తెరపై ఎక్కువగా చూశాం కానీ ఈ సినిమా ద్వారా అమ్మాయిల ఫీలింగ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నామన్న డైరెక్టర్.. ఈ సూపర్ ఫ్రెష్ సబ్జెక్టు అందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చింది.

Next Story