నువ్వు నా జీవితంలోకి ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరికోసమంటే..?

by sudharani |
నువ్వు నా జీవితంలోకి ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరికోసమంటే..?
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి అందరికి తెలిసిందే. ‘ఒక మనసు’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ‘ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి, హ్యపి వెడ్డింగ్, సైరా నరసింహారెడ్డి, సూర్యకాంతం’ వంటి మూవీస్‌తో అలరించింది. అయితే.. నటన పరంగా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ హీరోయిన్‌గా మాత్రం విఫలం అయిందనే చెప్పుకోవచ్చు. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. చైతన్యను పెళ్లి చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల చేత విడిపోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి మరి విడాకులు తీసుకున్నారు వీరిద్దరూ. ఇక విడాకుల అనంతరం కెరీర్‌పై ఫోకస్ పెట్టిన నిహారిక.. పలు సిరీస్‌లతో ఓటీటీలో అదరగొడుతోంది. అంతే కాకుండా ఇటీవల నిర్మాణ సంస్థను కూడా పెట్టి నిర్మాతగా రానిస్తుంది. ఇక ప్రస్తుతం నిహారిక చేతిలో రెండు సినిమాలతో పాటు.. కుకింగ్ షో కూడా ఉంది.

సినీ కెరీర్ గురించి పక్కన పెడితే.. ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్మడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి వేకేషన్స్‌కు చెక్కేస్తూ అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వారు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. నిహారిక ఫ్రెండ్స్‌లో ఒకరైన అంబటి భార్గవి పుట్టిన రోజు కావడంతో.. ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్ గోవాలో గ్రాండ్‌గా చేసుకున్నారు. ఈ మేరకు నిహారిక.. భార్గవి ఫొటో షేర్ చేస్తూ.. ‘నా ఈ అందమైన గులాబీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా జీవితంలోకి ఆలస్యంగా వచ్చినా ఫర్వాలేదు, కానీ నువ్వు మంచి కోసమే ఇక్కడ ఉన్నావు. మీరు నా జీవితాన్ని ప్రకాశవంతం చేస్తారు’ అంటూ ఎమోషనల్ ఈమోజీస్‌తో బర్త్‌డే విష్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.





Next Story