‘చెఫ్ మంత్ర సీజన్ 3’ తో ఆహా లోకి ఎంట్రీ ఇస్తోన్న నిహారిక కొణిదెల ..

by Kavitha |
‘చెఫ్ మంత్ర సీజన్ 3’ తో ఆహా లోకి ఎంట్రీ ఇస్తోన్న నిహారిక కొణిదెల ..
X

దిశ, సినిమా: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘చెఫ్ మంత్ర సీజన్ 3’ రాబోతోంది. కాగా ఇప్పటికే చెఫ్ మంత్ర రెండు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా కంప్లిట్ చేసుకొగా .. సమాచారం ప్రకారం ఈ సారి మూడో సీజన్‌ను నిహారిక కొణిదెల హోస్ట్‌గా రానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది ఆహా. అయితే ఈ షో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండబోతోన్నాయి. కాగా ఈ మొదటి ఎపిసోడ్ మార్చి 3 నుంచి రాత్రి 8 గంటలకు రానుంది. దీ తర్వాత ఎపిసోడ్ లు ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతాయి. నిహారిక గెస్టులతో పెట్టే ముచ్చట్లు.. హృదయాన్ని కదిలించే కథల నుండి ఉల్లాసకరమైన ఆటల వరకు అన్నీ కూడా ‘చెఫ్ మంత్ర సీజన్ 3’లో ఉండబోతున్నాయి. ఇక ప్రతీ శుక్రవారం ఆహా సబ్‌స్క్రెబర్లు కు అంతు లేని వినోదం అందబోతోంది.





Next Story