ఇష్టం లేదంటారు కానీ అందరూ ఆ సినిమాలే చూస్తారు : Mrunal Thakur

by Dishafeatures1 |
ఇష్టం లేదంటారు కానీ అందరూ ఆ సినిమాలే చూస్తారు : Mrunal Thakur
X

దిశ, సినిమా: నటించింది రెండు సినిమాలే అయినప్పటికి తెలుగు హీరోయిన్ గా తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్ . ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న ఈ బ్యూటీకి ఇతర భాషల్లో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ వైరల్ కామెంట్స్ చేసింది. ‘ఎన్ని సినిమాలు చేశామనే దానికంటే ఎన్ని మంచి సినిమాలు చేసామనేది ముఖ్యం. కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న బాలీవుడ్ పెద్ద సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు.

నాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాల్లో నటించాలని ఉంది. కానీ నాకు ఆఫర్లు రావడం లేదు బహుశా నేనింకా అక్కడంతా ఫేమస్ కాలేదేమో. నాకు చాలా మూవీ ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆ సినిమాలలో లవ్ స్టోరీలు లేవు. ఒకప్పుడు ఆ తరహా సినిమాలు చేయాలని ఉన్నా డైరెక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయా. నన్ను నేను ప్రూవ్ చేసుకునే క్రమంలో అలసిపోయా. అందుకే ఇక మూవీ ఆఫర్లు రావడం అనేది సహజంగా జరగాలని డిసైడ్ అయ్యా. మనమంతా చిన్నప్పటి నుంచి ప్రేమ, రొమాంటిక్ సినిమాలు చూస్తూ పెరిగాము. చాలా మంది రొమాన్స్ అంటే ఇష్టం లేనట్లు నటిస్తారు. కానీ అలాంటి సినిమాలే చూస్తారు ’అని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం మృణాల్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed