ఎక్స్‌పోజింగ్‌ చేయడంపై నెటిజన్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన అనసూయ పోస్ట్ వైరల్

by Hamsa |
ఎక్స్‌పోజింగ్‌ చేయడంపై నెటిజన్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన అనసూయ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ మొదటి జబర్థస్త్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరకు దూరమై పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు వరుస సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తనను ట్రోల్ చేస్తున్న వారికి తనదైన స్ట్రైల్లో గట్టిగానే ఇచ్చేస్తుంది. అనసూయ ఏం చేసినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ మొదలవుతుంది.

తాజాగా, అనసూయ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో పాత హీరోయిన్ల మాదిరిగా రెడీ అయి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అది చూసిన వారు కొందరు ఫిదా అవుతుంటే ఓ నెటిజన్ మాత్రం ‘ఎక్స్‌పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడమంటే’ అని కామెంట్ చేశాడు. దానికి అనసూయ తనదైన స్టైల్లో స్పందించింది. ‘‘ కరెక్ట్‌గా చెప్పారండి. సావిత్రమ్మలా యాక్టింగ్ చేయడం ఎవరి తరం కాదు. నేను ట్రిబ్యూట్ ఇచ్చానంతే.. అలాగే ఎక్స్‌పోజ్ చేయడం కూడా ఈజీ కాదు. ఫిజికల్లీ, ఎమోషనల్లీ చాలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఎలాంటి దుస్తులు వేసుకొని ఏమి ప్రదర్శించాలి అనుకుంటున్నామో అనేదానిపై కాన్ఫిడెంట్‌గా ఉండాలి’’ అని కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.Next Story

Most Viewed