అమ్మకు బాగోలేదని ఇల్లు అమ్మేస్తున్న అన్నావ్ ఇప్పుడు కారు ఎలా కొన్నావ్.. శాంతి స్వరూప్‌పై నెటిజన్స్ ఫైర్

by Disha Web Desk 7 |
అమ్మకు బాగోలేదని ఇల్లు అమ్మేస్తున్న అన్నావ్ ఇప్పుడు కారు ఎలా కొన్నావ్.. శాంతి స్వరూప్‌పై నెటిజన్స్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్లు పాపులారిటి దక్కించుకున్నారు. అందులో శాంతి స్వరూప్ ఒకరు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శాంతి.. ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటాడు. ఇటీవల తన అమ్మకు ఆరోగ్యం బాగోలేదని ఇల్లు అమ్మాలనుకుంటున్నా అంటూ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వీడియోతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త కారులో ఎంతో సంతోషంగా కూర్చుని సరదాగా ఉన్న వీడియో షేర్ చేస్తూ.. మై డ్రీమ్ అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. మొన్నే కదా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు ఇల్లు అమ్మేస్తున్నానంటూ ఓ వీడియో షేర్ చేశావు. అంతలోనే కారు కొంటున్నావా..? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Next Story

Most Viewed