ఆమె అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా.. అమ్మ పాటకి ప్రాణం పోసిన జాహ్నావి ఏవరంటే..?

by Prasanna |
ఆమె అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా.. అమ్మ పాటకి ప్రాణం పోసిన జాహ్నావి ఏవరంటే..?
X

దిశ, సినిమా: ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ పాటే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తల్లి ప్రేమను అంత.. ఇంత.. అని కొలవలేము. ఈ పాటలోని లిరిక్స్ మనస్సును హత్తుకునే విధంగా ఉన్నాయి. ఒకసారి విన్న వాళ్లు మళ్లీ మళ్లీ వింటూనే ఉన్నారు. అమ్మ పాటకి ప్రాణం పోసిన ఈ అమ్మాయి పేరు జాహ్నావి. ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాసారు. ఈ అమ్మాయిని జూనియర్ శ్రేయా ఘోషల్ అంటూ నెటిజెన్స్ పిలుస్తున్నారు. ఒక్కపాటతో పాపులర్ అయిన ఆ అమ్మాయి గురించి ఆరాలు తీయడం మొదలు పెట్టారు.

ఈ అమ్మాయి సొంత ఊరు మహారాష్ట్ర. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాహ్నవి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను తెలుగు అమ్మాయినే.. కానీ తనకు తెలుగు అసలు రాదని చెబుతుంది. మిట్టపల్లి స్టూడియో యూట్యూబ్ ఛానెల్‌లో జాహ్నవి అమ్మ పాటను అద్భుతంగ పాడింది.. సిస్కో డిస్కో సంగీతం అందించింది.

తెలుగు అర్ధం కాకపోయినా.. అమ్మ పాటను అందంగా పాడినందుకు సింగర్ జాహ్నవిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఆ అమ్మాయికి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకి పైగా ఫాలోవర్లు ఉన్నారు.Next Story

Most Viewed