నన్ను కమిట్మెంట్ అడిగారు.. కాస్టింగ్ కౌచ్‌‌పై నయనతార షాకింగ్ కామెంట్స్..!

by Disha Web |
నన్ను కమిట్మెంట్ అడిగారు.. కాస్టింగ్ కౌచ్‌‌పై నయనతార షాకింగ్ కామెంట్స్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై చాలా మంది హీరోయిన్‌లు, నటీమనులు పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మీడియాలో కూడా చాలా చర్చలు జరిగాయి. తాజాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందో లేదో అనే విషయంపై నేను మాట్లాడను. కానీ, మన ప్రవర్తన బట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా మంది కమిట్మెంట్ అడిగారు. అయితే నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పాను. కేవలం నా టాలెంట్‌ ను నమ్ముకుని ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయనతార చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Also Read...

Shahrukh Khan 'పఠాన్' రిలీజ్.. థియేటర్ల వద్ద హిందూ సంఘాల నిరసన (వీడియో)


Next Story