పెళ్లైన కొద్ది నెలలకే Nayanathara షాకింగ్ డెసిషన్? ఆందోళనలో ఫ్యాన్స్

by Hamsa |
పెళ్లైన కొద్ది నెలలకే Nayanathara షాకింగ్ డెసిషన్? ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా : స్టార్ నటి నయనతార అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యంగ్ డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్‌‌ను పెళ్లి చేసుకున్న నయన్.. ప్రస్తుతం హనీమూన్‌ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ బ్యూటీ త్వరలోనే సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తు్న్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా సంపాదించిన మొత్తాన్ని ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేసి వ్యాపారవేత్తగా రాణించాలనుకుంటోందని, ఫ్యామిలీ అవసరాల రీత్యా నటనకు స్వస్తి చెప్పాలని బలంగా ఫిక్స్ అయిందని సమాచారం.

అయితే సినిమాల్లో నటించకపోయినా నిర్మాతగా కొనసాగుతుందని, భర్తతో కలిసి ఇప్పటికే రెండు చిత్రాలు నిర్మించేందుకు ప్లాన్ చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు తెలుస్తుండగా.. ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Also Read : పెళ్లిచేసుకున్న న‌టి మ‌హాల‌క్ష్మి.. భ‌ర్త‌ను చూసి షాక‌వ్వొద్దు! (వీడియో)

Next Story