ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుని ట్విస్ట్ ఇచ్చిన నరేష్-పవిత్ర!

by Hamsa |
ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుని ట్విస్ట్ ఇచ్చిన నరేష్-పవిత్ర!
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు నరేష్, పవిత్ర జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కొద్ది రోజులు ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే అప్పట్లో వీరిద్దరి వివాహం సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే.. నటుడు నరేష్ అప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిపై అప్పట్లో కేసు కూడా పెట్టింది. అయినప్పటికీ నరేష్ పవీత్రను పెళ్లి చేసుకుని హనీమూన్‌కు కూడా వెళ్లాడు.

అలాగే ఈ జంట లిప్ లాక్ పెట్టుకున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత పవిత్ర-నరేష్ మళ్లీ పెళ్లి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని కోసం చేసిన ప్రమోషన్స్‌లోనే పిల్లల్ని కూడా కంటామని చెప్పారు. అలాగే త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర-నరేష్ అందరికీ షాకిస్తూ.. కామెంట్లు చేశారు. తామిద్దరం పిల్లలను కనాలని అనుకోవడం లేదని. ఇప్పుడున్న పిల్లలు మా పిల్లలే.. వారికే ఆస్తి చెందుతుంది అని కామెంట్స్ చేశాను. దీంతో ఇంతలోనే ఏమైందంటూ అయోమయంలో పడి పోయారు నెటిజన్లు. ప్రస్తుతం నరేష్-పవిత్ర కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఏమైనా వచ్చాయా? అందుకే పిల్లలను కనకుండా కలిసి ఉన్నని రోజులు ఉండి తర్వాత విడిపోవాలని అనుకుంటున్నారా? అని పలు రకాలుగా నెట్టింట చర్చించుకుంటున్నారు.

Next Story