- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో నాని ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్..!

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గత ఏడాది ‘దసరా’, ‘హాయ్ నాని’ వంటి రెండు డిఫరెంట్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక శనివారం అంటే ఈ రోజు ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ గ్లింప్స్ లో సూర్య అనే పాత్రలో నాని కనిపించగా ‘కోపాలు రకరకాలు. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కోలాగా ఉంటుంది కానీ.. ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నాకొడుకుని ఎవరైనా చూశారా? నేను చూసాను’ అంటూ ఎస్‌జే సూర్య వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ వీడియోను ప్రారంభించగా, డైలగ్ లోనే నాని ఎంట్రీ ఇచ్చాడు. చూస్తుంటే తమిళ వెర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ టీజర్ మూవీ పై ప్రేక్షకుల్లో , అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇక మొత్తానికి ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.