పాలిటిక్స్‌ ప్రచారంను తెగ వాడేసుకుంటున్న నాని.. రాహుల్‌ ఎక్సట్రాలెందుకంటూ సెటైర్?(వీడియో)

by Disha Web Desk 6 |
పాలిటిక్స్‌ ప్రచారంను తెగ వాడేసుకుంటున్న నాని.. రాహుల్‌ ఎక్సట్రాలెందుకంటూ సెటైర్?(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల ఉన్న నేపథ్యంలో రాజకీయం చాలా రసవత్తంరంగా మారింది. నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం ప్రచారంనీ సరికొత్తగా చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇటీవల నాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ మూవీతో రాబోతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో నాని మేనిఫెస్టో రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. పాలిటిక్స్‌లో నాయకులు ఎలా పలు హామీలు ఇస్తారో నాని కూడా సినిమా విషయంలో ఇచ్చాడు.

తాజాగా, నాని కేసీఆర్‌ పాత్రలో తెలంగాణ యాసతో ఓ ప్రెస్ మీట్‌ను నిర్వహించాడు. ఇందులో భాగంగా తెలంగాణ యాసలో కేసీఆర్‌లా జీవించేశాడు. ‘‘రాహుల్ వచ్చేసిండుగదా.. ఏందివయా అట్ల నవ్వుతారు. మేం ఫ్రెండ్స్ గదా.. మేం హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్నం కదా.. మేం ఎప్పుడూ ఇచ్చేదే అది.. ఎక్స్‌ట్రాలెందుకయా.. అరే చెప్తాన్నా విను.. ఏయ్ ఆగవయా నీ లొల్లిపాడుగాను.. ఆయననిటు తోల్కరండి.. నో చాన్స్ .. పోస్ట్ పోన్ కాదు.. ట్రైలర్ మొత్తం చూసి యాక్షన్ సినిమా అంటవేది.. ఆడితే ఆడతది, పీకితే పీకుతది.. పంచాది పెట్టొద్దు. డిసెంబర్ 7న దావత్ చేసుకోవాలె’’ అని కేసీఆర్ హావభావాతో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన వారు నాని పాలిటిక్స్ వాడుకుని ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్‌ను సరికొత్తగా నిర్వహిస్తున్నాడని అనుకుంటున్నారు.

Next Story

Most Viewed