ప్రభాస్ నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానంటూ నాగార్జున ఆసక్తికర పోస్ట్..

by Hamsa |
ప్రభాస్ నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానంటూ నాగార్జున ఆసక్తికర పోస్ట్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఈ ఏడాది నా సామి రంగ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. అదే ఫామ్‌లో ప్రస్తుతం కుబేర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్-8కు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అయితే నాగార్జున పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరన్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఒకసారి తప్ప నెట్టింట పోస్ట్ పెట్టరు అది కూడా వైరల్ అయితే కానీ స్పందించరు. అలాంటిది నాగార్జున్ తాజాగా, కల్కి ట్రైలర్‌పై ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ చూసిన నాగ్ మేకర్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘ ఏం ప్రపంచాన్ని సృష్టించారు నాగీ మీరు. మన భారతదేశం అపురూపమైన కథలను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నాము. అమిత్ జీ ఫైర్, కమల్ జీ జస్ట్ వావ్. ప్రయోగాలు చేసే ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను ప్రభాస్. చివరగా నా అభిమాన నిర్మాత అశ్వినీ దత్, స్వప్న, స్వీటీకి శుభాకాంక్షలు. మీరు అద్భుతంగా కల్కి సినిమాను నిర్మించారు. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం నాగ్ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా కల్కి జూన్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Next Story

Most Viewed