ఆసక్తి కలిగిస్తోన్న కింగ్ నాగార్జున దృశ్యాలు..

by Disha WebDesk |
ఆసక్తి కలిగిస్తోన్న కింగ్ నాగార్జున దృశ్యాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: కింగ్ నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న సినిమా 'ది ఘోస్ట్'. ఈ మూవీలో నాగార్జున, హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో 'గన్స్ అండ్ స్వార్ట్స్' పేరుతో ఓ వీడియోను పంచుకున్నారు చిత్రబృందం. ఈ వీడియో ఆధారంగా చూసుకుంటే.. ఈ సినిమాలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ పాత్రకు నాగార్జున చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఏ గన్ ఎలా ఉపయోగించాలి, శత్రువులను ఎలా సంహరించాలో నాగార్జున తీసుకుంటున్న ట్రైనింగ్ దృశ్యాలు ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ కత్తి తయారు చేయించారని తెలుస్తుంది. దానితో కూడా నాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆ కత్తి ప్రత్యేకంగా నిలవబోతుందని టాక్. కాగా ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read : నా నిజమైన పుట్టినరోజు ఆ రోజే.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed