Naga Chaitanya: ఉడిపిలో నాగచైతన్య ‘తండేల్’

by Disha Web Desk 10 |
Naga Chaitanya: ఉడిపిలో నాగచైతన్య ‘తండేల్’
X

దిశ,వెబ్ డెస్క్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఉడిపిలో ప్రారంభించారు. నాగ చైతన్యతో పాటు ఫైటర్స్‌పై యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఈ చిత్రంలో మత్స్యకారుడిగా నటించడానికి చైతూ బీస్ట్ మోడ్‌‌లోకి మారారు. కండలు తిరిగిన దేహం కోసం గత కొన్ని నెలలుగా ఆయన కష్టపడ్డారు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్‌లో నాగ చైతన్య కనిపిస్తారు.యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాగచైతన్యతో సాయిపల్లవి కలిసి నటించడం ఇది రెండోసారి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరీ’ లాంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇప్పుడు ‘తండేల్’ కోసం మరోసారి జతకట్టారు.

Next Story