కలిసి తిరుగుతున్న నాగచైతన్య, సమంత ఫొటో వైరల్..!

by Disha Web Desk 6 |
కలిసి తిరుగుతున్న నాగచైతన్య, సమంత ఫొటో వైరల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య, సమంత ‘ఏమాయ చేసావే’ మూవీతో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2017 లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఏమైందో తెలియదు కానీ 2021లో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపి అందరికీ షాకిచ్చారు. విడాకులకు కారణం తెలియకపోవడంతో వీరిద్దరికి సంబంధించిన రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. నాగచైతన్య వరుస చిత్రాలను ప్రకటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక సమంత మాత్రం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మయోసైటీస్ వ్యాధికి ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా, నాగచైతన్య, సమంత కలిసి ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు మళ్లీ వీరిద్దరు కలిస్తే బాగుండు అని అనుకుంటున్నారు.

Next Story