హాటెస్ట్ ఫొటోస్‌తో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్! ప్రమోషన్స్‌లో భాగంగా రెచ్చిపోతున్న బ్యూటీ

by sudharani |
హాటెస్ట్ ఫొటోస్‌తో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్! ప్రమోషన్స్‌లో భాగంగా రెచ్చిపోతున్న బ్యూటీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ నభా నటేష్ ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. కెరీర్ మంచి స్పీడ్‌లో ఉన్న టైంలో యాక్సిడెంట్ కారణంగా స్ర్కీన్‌కు దూరమైన ఈమె మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రజెంట్ ఈ అమ్ముడు చేతిలో నిఖిల్ ‘స్వయంభూ’తో పాటు ‘డార్లింగ్’ మూవీ చేస్తుంది. నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీని నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా.. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్స్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ ఆకట్టుకోగా.. జూలై 19 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే నభా నటేష్ కూడా తన ఇన్‌స్టా వేదికగా ప్రమోషన్స్ షురు చేసింది. ఒకపక్కా సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌తో అలరిస్తూనే మరోవైపు గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ.. ‘హాట్ బ్యూటీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story