సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్.. 23 వరకే ఛాన్స్!

by Hamsa |
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్.. 23 వరకే ఛాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా నటించిన ‘హనుమాన్’ విడుదలై నెల దాటినప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. అయితే దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని థియేటర్స్‌లో దుమ్మురేపుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఈ చిత్రం 300లకు పైగా థియేటర్స్‌లో నడుస్తోంది.

తాజాగా, హనుమాన్ మేకర్స్ సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. నైజాం థియేటర్లలో టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపారు. సింగిల్ స్క్రీన్ టికెట్ రూ. 175ది రూ. 100కి తగ్గించాము. అలాగే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 ఉన్న టికెట్‌ రూ. 150కి ఇస్తున్నాము. ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో మూవీ లవర్స్ ఆనందపడుతున్నారు.

Next Story

Most Viewed