- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాటు నాటు’ పాట పెడితేనే నా కొడుకు అన్నం తింటున్నాడు: కరీనా కపూర్
‘RRR’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచం ఫిదా అయింది.

X
దిశ, సినిమా: ‘RRR’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచం ఫిదా అయింది. ఎక్కడ చూసినా ఈ పాటకు కాలు కదుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పాట క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ‘నాటు నాటు’కు స్టెప్పులేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా చిన్న కొడుకు జెహ్ ‘నాటు నాటు’ పాట పెడితే కానీ అన్నం తినడం లేదు. అది కూడా తెలుగులో వినడానికి ఇష్టపడుతున్నాడు. జెహ్‌కి ఈ నాటు నాటు పాట బాగా నచ్చింది. ఆ పాట వచ్చినప్పుడల్లా వాడు ఆనందంతో గంతులేస్తున్నాడు. ఆస్కార్ గెలిచిన ఈ పాట.. ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ పొగిడేసింది.
Also Read...
Next Story






