నా నిజమైన పుట్టినరోజు ఆ రోజే.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

by Disha Web Desk 6 |
నా నిజమైన పుట్టినరోజు ఆ రోజే.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో మెగాస్టార్‌గా స్థానం సంపాదించుకున్నాడు. అప్పట్లో సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేశాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ప్రేక్షకులతో పలు విషయాల గురించి పంచుకుంటున్నాడు.

తాజాగా, చిరంజీవి ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. " మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టిన రోజు ఈరోజు. 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి.. ప్రాణప్రదంగా నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎప్పటికీ మీ చిరంజీవి " అంటూ రాసుకొచ్చారు మెగాస్టార్. ఇక చిరు సినిమాల విషయానికొస్తే గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Also Read : ఆసక్తి కలిగిస్తోన్న కింగ్ నాగార్జున దృశ్యాలు..


Next Story

Most Viewed