సెన్స్ లేకుండా నా అర్ధ నగ్న ఫోటోలు లీక్ చేశారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్

by Kavitha |
సెన్స్ లేకుండా నా అర్ధ నగ్న ఫోటోలు లీక్ చేశారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: అలనాటి హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సందడి చేసి సత్తా చాటింది. ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో ఎన్నో సినిమాలు చేసిన ఈమె.. ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా అందుకుంటుంది. బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి చాలా సీరియళ్లు చేసింది. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమయిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో కీ రోల్ చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా కెరీర్ మొదలైనప్పటి నుంచి వరుసగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమె ఒక డాక్టర్ ను వివాహమాడి అమెరికాకు వెళ్ళిపోయింది. ఆ తరువాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలోనే బిడ్డకు పాలు ఇస్తూ అర్ధనగ్నంగా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోస్ అప్పట్లో రచ్చ సృష్టించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దాని గురించి మాట్లాడుతూ.. అసలు ఆ ఫోటోలు నా అనుమతి లేకుండా ఇండియాలోని ప్రముఖ మీడియా కంపెనీనే సెన్స్ లేకుండా వాటిని దొంగిలించి పబ్లిష్ చేసిందని మండిపడింది. అసలు ఆ ఫోటోషూట్ నేను ఇండియా కోసం చేయలేదు. అమెరికాలో తల్లిబిడ్డల మాతృత్వం గురించి ఒక మ్యాగజైన్ వారు అడిగితే ఓకే చెప్పాను. దాన్ని ఇండియాలో రిలీజ్ చేయకూడదు. కానీ, కొంతమంది ఆ ఫోటోలను దొంగలించి.. కనీసం నన్ను కూడా సంప్రదించకుండా ఇండియాలో లీక్ చేశారు. మాతృత్వానికి అమెరికా వాళ్ళు ఇచ్చే విలువ వేరు ఉంటుంది.. మన వాళ్ళు ఇచ్చే విలువ వేరు ఉంటుంది.

ఇక్కడ బిడ్డకు పాలు ఇచ్చినా ఏదో రకంగా చూస్తారు. అయితే అందరూ అలా ఉండరని తెలుసుకున్నా.. ఆ ఫోటో షూట్ చూసిన చాలామంది ఇండియన్ మహిళలు కూడా నన్ను ప్రశంసించారు. ఎందుకంటే వారు కూడా అమ్మలే కాబట్టి. వారికి కూడా ఆ విలువ తెలుసు కాబట్టి. ఆ తర్వాత పురుషులు కూడా నాకు సపోర్ట్ గా నిలిచారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.




Next Story

Most Viewed