‘పుష్ప 2’ లో నా పాత్రకు చాలా బాధ్యత ఉంటుంది.. రష్మిక

by Dishafeatures1 |
‘పుష్ప 2’ లో నా పాత్రకు చాలా బాధ్యత ఉంటుంది.. రష్మిక
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నటి రష్మికమందన్న ఇటీవల ‘యానిమల్’ మూవీతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ వంటి వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు రష్మిక. అయితే తాజాగా ఒక మీడియా తో రష్మిక మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.. ‘ నేను ఒక సినిమాకు సైన్ చేసేటప్పుడు స్క్రిప్ట్‌ని క్షుణ్ణంగా వింటాను. నా పాత్ర కనుక నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ముఖ్యంగా నేను ఎంపిక చేసుకునే సినిమాల్లో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటా.

కానీ అది అన్ని సినిమాలకు సాధ్యం కాదు. ఇక ‘పుష్ప 2’ షూటింగ్‌ కి వెళ్లిన సమయంలో నా సొంతం ఫ్యామిలీకి తిరిగి వెళ్లినట్లు అనిపించింది. ఈ సినిమాలో పుష్ప రాజ్‌ భార్య పాత్రలో కనిపించబోతున్నాను. పెళ్లి తర్వాత సహజంగానే బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ‘పుష్ప 2’ లో కూడా నా పాత్రకు చాలా బాధ్యత పెరిగింది. మా డైరెక్టర్ సుకుమార్‌ వర్కింగ్‌ స్టైల్‌ సూపర్.. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి షాట్‌ను కూడా ఎంతో జాగ్రత్తగా తీస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.


Next Story

Most Viewed