ఎమోషనల్ అవుతూ స్టేజ్‌పై ఆ పని చేసిన మృణాల్ ఠాకూర్ (వీడియో)

by Disha Web Desk 7 |
ఎమోషనల్ అవుతూ స్టేజ్‌పై ఆ పని చేసిన మృణాల్ ఠాకూర్ (వీడియో)
X

దిశ, సినిమా: యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి తెలిసిందే. బుల్లితెర నటిగా తన కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తన నటనతో, అందంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వచ్చిన ‘సీతా రామం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అనతికాలంలో తెలుగింటి మహాలక్ష్మీలా అభిమానుల మనసు దోచుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మృణాల్‌కు ప్రత్యేక స్థానం ఉందంటే అతిశయోక్తి కాదు. తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ చిత్రంతో కూడా మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో వస్తు్న్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు ప్రతి ఒక్క అప్‌డేట్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో మృణాల్ తన సినిమా గురించి, ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మృణాల్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నాను. మీరు నాకు ఇచ్చిన సక్సెస్‌కు నేను చాలా ఆనందంగా ఉన్నాను థాంక్యూ. నేను ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ మీరు ఇస్తున్న ఈ సపోర్ట్‌కు నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed