స్టార్ హీరోకి ఫ్లాప్ ఇచ్చిన మదర్ సెంటిమెంట్ మూవీ.. ఏంటో తెలుసా!

by Disha Web Desk 18 |
స్టార్ హీరోకి ఫ్లాప్ ఇచ్చిన మదర్ సెంటిమెంట్ మూవీ.. ఏంటో తెలుసా!
X

దిశ, వెబ్ డెస్క్:టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సుపరిచితమే. ఈ స్టార్ హీరో క్రేజ్ తెలుగు సినీ రంగంలో మాములుగా ఉండదు. ఈ హీరో నటించిన మూవీలు సూపర్ హిట్ అయ్యాయి. అంతే కాదు బాలీవుడ్, టాలీవుడ్ లో హీరో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో మూవీలో నటించిన ఈ సూపర్ స్టార్ తన కామెడీ, తన నటనతో ఆకట్టుకునే ఉంటున్నారు. అమ్మాయిల మనసులను దోచుకున్నారు. మహేష్ బాబు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయినా ఒక మూవీ మాత్రం ఫ్లాప్ అయింది అంటా..ఆ మూవీ మదర్ సెంటిమెంట్ తో ఉందంటా ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అది ఏ మూవీ అంటే డైరెక్టర్ సూర్య దర్శకత్వంలో వచ్చిన మూవీలో మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ నాని. రొమాంటిక్ కామెడీ మూవీగా వచ్చిన నాని సినిమా మొత్తం మదర్ సెంటిమెంట్‌తోనే ఉంటుంది. ఈ మూవీ లో చిన్న వయసులో తల్లికి తనంటే ఇష్టం లేదని చనిపోదామనుకున్న కుర్రాడికి ఓ సైంటిస్ట్ తన ప్రయోగంతో యువకునిగా మార్చుతాడు. తర్వాత ఆ ప్రయోగం ఫెయిల్ అయి పగలు పిల్లాడిలా, రాత్రి యువకుడిగా ఉంటాడు. అంతే కాదు ఈ సినిమాలో తన తల్లి సెంటిమెంట్ బాగా ఉంటుంది. ఈ క్రమంలోనే భార్య ప్రెగ్నెంట్ కావడం ద్వారా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, కొన్ని సీన్ల వరకు బాగానే ఉన్నా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి కామెడీ రోల్‌లో మహేష్ బాబును అభిమానులు, ప్రేక్షకులు చూడలేకపోయాము అంటూ కామెంట్స్ చేశారు. ఆ టైం లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. మహేష్ బాబు కి మదర్ సెంటిమెంట్ కలిసి రాలేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed