'Laal Singh Chaddha' స్వల్పకాలిక చిత్రం కాదు.. ప్రజలతోనే ఉండిపోతుంది

by Hamsa |
Laal Singh Chaddha స్వల్పకాలిక చిత్రం కాదు.. ప్రజలతోనే ఉండిపోతుంది
X

దిశ, సినిమా : 'లాల్ సింగ్ చడ్డా' భారీ వసూళ్లు రాబట్టకపోవడంపై మోనాసింగ్ స్పందించింది. ఈ మూవీలో అమీర్‌ ఖాన్‌ తల్లిగా నటించిన ఆమె.. తమ చిత్రం అనేక కారణాల వల్ల నెటిజన్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడింది. ముఖ్యంగా 'బాయ్‌కాట్' ట్రెండ్ రీజన్‌తో బాక్సాఫీస్ వద్ద నష్టపోయినట్లు పేర్కొన్న నటి.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత మరింత మందికి చేరువవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇది హిట్ లేదా ఫ్లాప్ అని లేబుల్ చేయబడే స్వల్పకాలిక చిత్రం కాదని, కొంత కాలంపాటు ప్రజలతోనే ఉంటుందన్న మోనా.. ఇలాంటి మధురమైన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పింది.

'ఈ మూవీ ఎంతోమందికి తృప్తి కలిగించింది. సినిమా చూసిన అందరికీ స్టోరీ గురించి చెప్పడానికి ఎన్నో మంచి విషయాలున్నాయి. డబ్బు ఎంత వచ్చిందనే స్వల్పకాలిక విషయాల గురించి ఆలోచించనక్కర్లేదు. జనాలకు ఎలాంటి ఫీలింగ్ ఇచ్చిందనేది ఇంపార్టెంట్' అంటూ తన ఒపీనియన్ చెప్పింది. ఇక అమీర్‌కు తల్లిగా నటించడంపై వచ్చిన విమర్శలు చూసి ఎంతో బాధపడ్డానన్న ఆమె.. మూవీ యూనిట్, అమీర్ మద్దతుగా నిలిచినందుకు థాంక్స్ చెప్పింది.

Next Story