- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మొగలిరేకులు’ సీరియల్ నటుడు మృతి.. సంచలన నిజాలు బయటపెట్టిన వైద్యులు!

దిశ, సినిమా: మొగలిరేకులు సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్ర నాథ్ మార్చి 1న మరణించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు బుల్లితెర నటీనటులు పోస్టులు షేర్ చేయడంతో ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మొగలిరేకులు, చక్రవాకం వంటి సీరియల్స్‌లో నటించిన పవిత్రనాథ్ మరణవార్త తెలిసి సినీ ప్రేక్షకులు ఆవేదన చెందారు. అయితే అసలు పవిత్రానాథ్ ఎలా చనిపోయాడనేది ఎవ్వరికీ తెలియదు. అంత చిన్న వయస్సులో మరణించడానికి గల కారాలేంటోనని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పవిత్ర నాథ్ మృతి గత కారణాలు బయటకు వచ్చాయి.
ఆయన గత కొద్ది కాలంగా డిప్రెషన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. దానికి కారణాలేంటో తెలియనప్పటికీ ఇండస్ట్రీ మిత్రులకు కూడా దూరంగా ఉంటున్నాడట. సడెన్‌గా పవిత్రనాథ్‌కు అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారని సమాచారం. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారని వైద్యులు నిర్ధారించారు. అయితే మరో విషయాన్ని కూడా వారు వెల్లడించడం గమనార్హం. పవిత్ర నాథ్ హార్ట్ ఫెయిల్యూర్ కారణంతోనే చనిపోయినట్లు తెలిపినట్టు సమాచారం. పవిత్ర నాథ్ మరణం గురించి ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తే కానీ అసలు విషయాలు బయటకు రావు.
Read More..
మొగలిరేకులు సీరియల్ నటుడు మృతి.. ఈ బాధను వర్ణించలేకపోతున్నామంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్