- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెడ్‌రూమ్ సీన్స్‌తో ‘మిక్సప్ ఆన్’ టీజర్ రీలీజ్.. మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులే!

దిశ, సినిమా: కరోనా వచ్చినప్పటి నుంచి ఓటీటీ ట్రెండ్ అందుబాటులోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఎన్నో వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలు జనాలు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేవారు. ఇక కరోనా వచ్చి పోయినప్పటి నుంచి ఓటీటీ ట్రెండ్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఏ కొత్త సినిమా వచ్చినా జనాలు థియేటర్స్‌కు పోకుండా ఓటీటీలోనే ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ఓటీటీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఇందులో ఈ మధ్య కాలంలో వచ్చిన బోల్డ్ కంటెంట్స్ రికార్డు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా, అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహాలో కొత్తగా పెళ్లైన వారిని టార్గెట్ చేస్తూ ‘మిక్సప్ ఆన్’ బోల్డ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ముందుగానే మేకర్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడాలని సజెస్ట్ చేశారు. టీజర్‌లో కమల్ కామరాజు బెడ్ మీద పడుకుని ఉంటే.. అతని భార్య కొరడాతో కొడుతూ తన కామ వాంఛను తీర్చుకుంటుంది. ఆ తర్వాత నటుడు ఆదర్శ్ తన భార్యతో నేను నీ మొగుడిని నాకు ఇష్టం ఉన్నప్పుడు ముట్టుకునే హక్కు నాకు ఉంటుంది అంటాడు. ఇలా అన్ని బెడ్ రూమ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌లో టీజర్ ఉంటుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇక అబ్బాయిలు తట్టుకోవడం కష్టమే అంటూ వల్గర్‌గా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. కాగా ఈ సినిమా మార్చి 15న ఓటీటీలో అందుబాటులోకి రానుంది.