' మేమ్ ఫేమస్ ' ట్విట్టర్ రివ్యూ

by Prasanna |
 మేమ్ ఫేమస్  ట్విట్టర్ రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్ : గతంలో కంటే ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం ఇలా ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అలా మన ముందుకు వచ్చిన సినిమానే 'మేమ్ ఫేమస్'. ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా విడుదల కాకా ముందే ప్రమోషన్స్ తో చాలా ఫేమస్ అయింది. నేడు థియేటర్లో సందడి చేస్తుంది. ఈ సినిమా చుసిన ప్రేక్షకులు, నెటిజెన్స్ ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు.

'మేమ్ ఫేమస్' సినిమాను చూసిన ఓ నెటిజన్ 'మేమ్ ఫేమస్ సినిమా ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇది సరిగానే టేకాఫ్ అయినా.. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. కానీ, స్క్రీన్‌ప్లే కొంచం స్లో అయింది. మ్యూజిక్ కూడా సెట్ అవ్వలేదు.. కొన్ని సార్లు షార్ట్ ఫిల్మ్‌ చూసినట్టు అనిపించింది' అని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed