మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌కు స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్

by Disha Web Desk 9 |
మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌కు స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్
X

దిశ, సినిమా: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత ఏడాది భోళా శంకర్ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో చిరు ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక 18 ఏళ్ల క్రితం చిరంజీవి సరసన స్టాలిన్ మూవీలో కలిసి నటించిన హీరోయిన్ త్రిష ఈ సినిమాలో కథానాయికగా నటించగా.. స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించనుందట. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో పలు లాంగ్వేజెస్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.

ఇకపోతే ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో ‘ఊర్వశీ రౌటేలా’ స్టెప్పులేయబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో అదిరిపోయే స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను ఊరించింది. ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Read More..

మెగాస్టార్ చిరంజీవికి అమెరికాలో ఘన సన్మానం.. ఆకట్టుకుంటోన్న చిరు స్పీచ్


Next Story