చిరంజీవిని భయపెట్టిన పవన్ కళ్యాణ్‌కున్న భయంకరమైన అలవాటు ఇదే?

by Disha Web Desk 9 |
చిరంజీవిని భయపెట్టిన పవన్ కళ్యాణ్‌కున్న భయంకరమైన అలవాటు ఇదే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఇష్టం. అన్ని విధాలుగా పవన్ కు సపోర్ట్ గా ఉంటూ ఈ స్థాయికి తీసుకొచ్చింది చిరునే అని చాలా సందర్భాల్లో పవర్ స్టార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ మంచితనానికి, నటనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నరనడంతో అతిశయోక్తి లేదు.

అయితే తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూకు హాజరై తన ప్రియమైన తమ్ముడు పవన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ చిన్న ఆర్టిస్ట్ కోసం పవన్ నిలబడిన సందర్భంలో ఎదురైన ఘటనను చిరంజీవి వివరించిన విషయం తెలిసిందే. తాజాగా చిరు ఈ విషయాలను మరోసారి గుర్తు చేసుకుని నవ్వసాగారు. విషయానికొస్తే.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవర్ స్టార్‌కు కొన్ని అలవాట్లు ఉన్నాయి. అందులో బుక్స్ చదవడం, మార్ష ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం, వ్యవసాయం చేయడం వంటివి ఆయన దినచర్యలో భాగమైన అలావాట్లట.

అంతేకాకుండా వీటితో మరో అలవాటు భయకరమైన హాబిట్ ఉండేదని మెగాస్టార్ వెల్లడించారు. ‘పవన్‌కు గన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఫారిన్ వెళ్లిన ప్రతిసారి డమ్మి గన్స్ తీసుకొని రమ్మనేవాడు. గన్స్ పై పవన్ పెంచుకుంటున్న ప్రేమ చూస్తే నాకు చాలా భయమేసేది. కొంపదీసి పవన్ నక్సలైట్స్‌‌తో కలిసిపోతారేమోనని చాలా బాధపడ్డాను. కానీ చివరిగా జనం మెచ్చిన నాయకుడు అవుతాడని అస్సలు ఊహించలేదు’. అంటూ చిరు తెలిపారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed