- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Mathu Vadalara-2: ‘మత్తు వదలరా- 2’ పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ.. ఏమన్నారంటే?
దిశ, వెబ్‌డెస్క్: రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా - 2 రెండ్రోజుల క్రితం(సెప్టెంబరు13) రిలీజై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్‌గా నటించారు. 2019 లో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్‌గా మత్తు వదలరా-2 తెరకెక్కింది. శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, రోహిణి, వెన్నెల కిశోర్, సత్య, అజయ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. కలెక్షన్ల పరంగా కూడా మత్తు వదలరా-2 దూసుకుపోతుంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీపై పెద్ద పెద్ద సెలబ్రిటీలు రివ్యూలిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చారు.
‘‘నిన్ననే మత్తు వదలరా - 2 చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ను కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణాకు ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేము. హ్యాట్స్ ఆఫ్ రితేష్ రానా. నటీనటులైన సింహా అండ్ స్పెషల్‌గా సత్యకు నా అభినందనలు. అలాగే అబ్దుల్లా, కాల భైరవలకు, మంచి విజయాన్ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు, చిత్ర బృందానికి అందరికీ నా అభినందనలు. అందరూ ఈ మూవీని తప్పకుండా చూడండి. మిస్ అవ్వకండి. మత్తు వదలరా -2 100% గ్యారంటీగా ఎంటర్‌టైన్ చేస్తుంది’. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికన రాసుకొచ్చారు.